యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన నాదల్‌…

nadal
nadal


న్యూయార్క్‌: ఊహించినట్లుగానే స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాదల్‌ 7-6(8/6),6-4, 6-1 తేడాతో బెర్రెట్టినీ(ఇటలీ)పై గెలిచి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు.ఇప్పటికి 18 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నాదల్‌ మరో టైటిల్‌కు అడుగు దూరంలో మాత్రమే నిలిచాడు. 42ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన బెరెటిని సెమీఫైనల్లో నిరాశపరిచాడు. వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు నాదల్‌ పైచేయి సాధించి తుదిపోరుకు అర్హత సాధించాడు. నాదల్‌-బెర్రెట్టినీల మధ్య జరిగిన తొలి సెట్‌ రసవత్తరంగా సాగింది.

ఇద్దరు సమంగా తలపడటంతో ఆ సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే ఇక్కడ కూడా ఆసక్తికర సమరమే జరిగింది. కాకపోతే చివరకు నాదల్‌ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి సెట్‌ను గెలిచిన ఊపును రెండు, మూడు సెట్లలో నాదల్‌ కొనసాగించాడు. అయితే బెర్రిట్టినీ మాత్రం అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్నాడు. రెండో సెట్‌ను నాదల్‌ 6-4తో గెలవగా, మూడో సెట్‌ను 6-1తో దక్కించుకోవడంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫలితంగా 19వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై నాదల్‌ గురిపెట్టాడు. ఇప్పటివరకు 18గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్‌…యూఎస్‌ ఓపెన్‌ను మాత్రం మూడుసార్లు మాత్రమే అందుకున్నాడు. 2017లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ను గెలిచిన నాదల్‌…ఈసారి కూడా టైటిల్‌పై ధీమాగా ఉన్నాడు. టాప్‌ సీడ్‌ ఆటగాళ్లు రోజర్‌ ఫెదరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టడంతో నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ను కష్టం కాకపోవచ్చు.మరో సెమీస్‌లో దిమిత్రోవ్‌పై మెద్వెదేవ్‌ పైచేయి సాధించాడు. 7-6(7-5), 6-4, 6-3తేడాతో విజయం సాధించాడు. దీంతో 14ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రష్యన్‌ ఆటగాడిగా మెద్వెదేవ్‌ రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరగనున్న అంతిమ సమరంలో మెద్విదేవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు.నాదల్‌కు కెరీర్‌లో ఇది 27వ ఫైనల్‌ కాగా మెద్విదేవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు అదుకున్న ఫెదరర్‌ (20)ను సమీపించేందుకు నాదల్‌కు ఇది చక్కని అవకాశంగా అందరూ భావిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/