ముంబైలోని స్థానిక క్రికెటర్‌ దారుణహత్య

rakesh panwar
rakesh panwar


ముంబై: ముంబయికు చెందిన ఓ స్థానిక క్రికెటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ముంబైలోని బందూప్‌ అనే ప్రాంతంలో రాకేశ్‌ పన్వార్‌ అనే క్రికెటర్‌ పెట్రోల్‌ బంక్‌లో ఉండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో పన్వార్‌కు తీవ్ర గాయాలయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాకేశ్‌ను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పెట్రోల్‌ బంకులోని సిసి టివి ఫుటేజి ఆధారంగా విచారణ జరుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/