సంచలన నిర్ణయం తీసుకున్న ఎంఎస్‌ ధోనీ

MS Dhoni
MS Dhoni

జార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ… ఇండియన్ ఆర్మీలో చేరి… విధులు నిర్వహించాడు. రెండు వారాలపాటూ వాళ్లతోనే ఉండి, వాళ్ల కష్టాలు, దేశం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలూ అన్నీ కళ్లారా చూశాడు. మన కోసం అంత చేస్తున్న వాళ్ల కోసం మనం కూడా ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అప్పుడొచ్చిందో కొత్త ఆలోచన అదే టీవీ సిరీస్. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు సాధించిన ఆర్మీ అధికారుల జీవితాల్ని టీవీ షో ద్వారా ప్రపంచానికి చాటాలనుకుంటున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్ జరుగుతోంది. స్టూడియో నెక్స్ట్‌, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్‌… సోనీ టీవీలో ప్లే కాబోతోందని తెలిసింది. ఓ మంచి ఉద్దేశంతో ధోనీ తీసుకున్న నిర్ణయంపై అటు అభిమానులు ఇటు దేశ ప్రముఖులు, ఆర్మీ నుంచీ పాజిటివ్ స్పందన వస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/