నెట్‌ ప్రాక్టీస్‌లో అదరగొట్టిన ధోని.

చెన్నై: క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపిఎల్‌ సీజన్‌ వచ్చేసింది. మరో ఐదు రోజులో అంటే ఈనెల 23వ తేదీన తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. చెన్నైలోకి చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు హోరాహోరీగా తలపడబోతున్నాయి. దీనికోసం ఇరు జట్లూ నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నై చేరుకున్న సూపర్‌కింగ్స్‌ జట్టు నెట్‌ ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ సందర్భంగా మహేంద్రసింగ్‌ ధోని చాలాసేపు నెట్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. డైనమైట్‌ వంటి షాట్లు ఆడారు. ధోని, సురేశ్‌ రైనా, అంబటి రాయుడుతో పాటు పలువురు ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశారు. కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ హస్సీ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ధోని ఎక్కువగా భారీ షాట్లు ఆడాడు. యువ బౌలర్ల బౌలింగ్‌లో వరుసపెట్టి సిక్సర్లు బాదాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమన్యాం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. నెట్‌ ప్రాక్టీస్‌లో ధోని తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డారు. పాదాలను చురుగ్గా కదుపుతూ భారీ షాట్లు ఆడాడు. అతను కొట్టిన ప్రతిషాట్‌ కూడా బంతి స్టాండ్స్‌లో వెళ్లి పడింది. దీనితో ఈ సారి కూడా ఐపిఎల్‌లో ధోని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారని అంటున్నారు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: