ధోని అంటే నాకు చాలా ఇష్టం : సన్నిలియోన్‌…


ముంబై: టీమిండియా క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నారు బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌. ఓ కార్యక్రమంలో మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు…? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు ధోని పేరు చెప్పారు సన్నీ. ఎందుకు..? అని అడగ్గా…ధోని ఫ్యామిలీ పర్సన్‌ అని ఆయనలో తనకు నచ్చే విషయం అదేనని తెలిపారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటారని సన్నీలియోన్‌ పేర్కొన్నారు. కుమార్తె జీనాతో కలిసి దిగే ఫోటోలంటే తనకు చాలా ఇష్టమని, చాలా క్యూట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. చివరగా ‘తేరా ఇంత్‌జార్‌ అనే చిత్రంతో సన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2017లో విడుదలైన ఆ సినిమాలో అర్బజ్‌ఖాన్‌తో కలిసి సన్నీ నటించారు. ప్రస్తుతం ఆమె మళయాళం సినిమా ‘రంగీలాతో పాటు తమిళ సినిమా ‘వీరమదేవిలో నటించనున్నారు.

మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/