రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌

Afganistan team
Afganistan team

సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఆసక్తికర పోరు జరగుతుంది. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌తో బరిలోకి దిగి రెండు వికెట్లు కోల్పోయింది. ముజీబ్‌ రెహ్మాన్‌కే మొదటి వికెట్‌ లిట్టన్‌ దాస్‌(16) దక్కింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఓపెనర్లను కట్టడి చేస్తూ బంగ్లాపై ఆఫ్ఘన్‌ బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నారు. నబీ బౌలింగ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌(36) ఔటయ్యాడు. బంగ్లా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకీబ్‌ అల్‌ హసన్‌(48), ముష్‌ఫిర్‌ రహీమ్‌(28)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/