నెటిజన్ల నోరు మూయించిన మిథాలిరాజ్‌

mithali raj
mithali raj

హైదరాబాద్‌: సెలబ్రిటీలకు ఎప్పుడూ నెటిజన్లతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వారిపై చేసే కామెంట్లకు సెలబ్రిటీలు సమాధానం చెప్పలేకపోకపోతుంటారు కొన్నిసార్లు. అయితే మిథాలిరాజ్‌ దీనికి భిన్నంగా ప్రవర్తించారు.
టీమిండియా కెప్టెన్‌ మిథాలిరాజ్‌ తనపై తరచూ ట్రోలింగ్‌ చేస్తున్న ఓ నెటిజన్‌కు గట్టిగా సమాధానమిచ్చి నోరు మూయించింది. ఇటీవల మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచిన సందర్భంగా క్రికెట్‌ లెజెండర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మిథాలి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు. అందుకు మిధాలి స్పందిస్తూ చిన్నపటి నుంచి చూస్తు పెరిగిన క్రికెట్‌ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉందని ఓ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్‌ మిథాలిరాజ్‌ మాతృభాష తమిళం అయినా ఎప్పూడూ ఆ భాష మాట్లాదని, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుందని ట్రోల్‌ చేసింది. దీనికి సమాధానమిస్తూ ‘నా మాతృభాష తమిళమే. నేను తమిళం భాగా మాట్లాడుతా కానీ నేను ఒక భారతీయురాలిగా ఉంటా. నా ప్రతి పోస్టుకు స్పందించి మిలాంటి వారి మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా అని గట్టిగా సమాధానమిచ్చింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/