బుమ్రాకు డోప్‌ టెస్టు

bumrah, ravi sastri
bumrah, ravi sastri


భారత పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా డోప్‌ పరీక్షకు హాజరయ్యాడు. ప్రపంచకప్‌ ఆడుతున్న ఆటగాళ్లకు నిర్వహిస్తున్న డోప్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం బుమ్రాకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ( వాడా ) ఈ పరీక్ష నిర్వహించింది. అతని నుంచి మూత్రం శాంపిల్‌ను సేకరించింది. ఈ పరీక్షలు ఫలానా వాళ్లకు మాత్రమే నిర్వహించాలని ఏ నిబంధన లేదు. వాడా తనకు నచ్చిన ఏ ఆటగాడినైనా పరీక్షించవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/