మాక్స్‌వెల్‌ పశ్చాత్తాపం

MAXWWLL, DHONI--
MAXWWLL, DHONI–

ధోనీని అనుకరించిన మాక్స్‌వెల్‌ పశ్చాత్తాపం

సిడ్నీ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు మహేంద్రసింగ్‌ ధోనీని ఆస్ట్రేలియా హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ సరదాగా కవ్వించే ప్రయత్నం చేశాడు. సిడ్నీ వేదికగా శనివారం ఉదయం 7.50గం.ల నుంచి తొలి వన్డే ప్రారంభం కానుండగా….వన్డే సిరీస్‌కు ఎంపికైన ధోని బుదవారమే అక్కడకి చేరుకున్నాడు. అయితే…గత పర్యటనలో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ధోని క్యాచ్‌ని మాక్స్‌వెల్‌ జార విడచగా….ఆ తర్వాత బంతికి హెలికాప్టర్‌ షాట్‌ ఆడిన ధోని ఏకంగా 115 మీటర్ల సిక్స్‌ని బాదేశాడు. తొలి వన్డేకి ముందు సరదాగా ఆ విషయాన్ని ప్రస్తావించిన మాక్స్‌వెల్‌…ధోని తరహాలో హెలికాప్టర్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ భారత్‌ దిగ్గజ క్రికెటర్‌ ధోని క్యాచ్‌ని ఆ మ్యాచ్‌లో జారవిడిచాను. ఆ తర్వాత బంతినే ధోని స్టాండ్స్‌లోకి తరలించేశాడు. జేమ్స్‌ ఫాల్కనర్‌ బౌలింగ్‌లో అనుకుంటా…ఆ సిక్స్‌ 115 మీటర్ల దూరం వెళ్లిందని మాక్స్‌వెల్‌ పశ్చాత్తాపంతో గుర్తు చేసుకున్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కి ముందు టీ20 సిరీస్‌లో విఫలమైన మాక్స్‌వెల్‌…ప్రపంచకప్‌కి ముందు ఫామ్‌ అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్‌తో వన్డే సిరీస్‌లో చెలరేగాలని ఈ హిట్టర్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు ధోని పరిస్థితి కూడా అలానే ఉంది. గత ఏడాదికాలంగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న ధోని…ఇటీవల టీ20 జట్టులోనూ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.