ఛాంపియన్ షిప్ నుంచి మేరీకోమ్‌ ఓటమి

రష్యాలో కొనసాగుతున్న బాక్సింగ్ ఛాంపియన్ షిప్

Mary Kom
Mary Kom

రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్.. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ కేరిరోగ్లు చేతిలో (51 కిలోల విభాగంలో) 14 తేడాతో ఓడిపోయి, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి వెనుదిరిగింది. రష్యాలోని ఉలాన్ ఉదెలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్ 50 తేడాతో గెలుపొందింది. మరోవైపు, ఇదే ఛాంపియన్ షిప్ లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/