సెరెనా విలియమ్స్‌, మేరీకోమ్‌ నాకు స్పూర్తి!

వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపి

koneru humpy
koneru humpy

విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌, టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్పూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్‌, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్‌ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటంబ పాత్ర ఎంతో ఉందని తెలిపింది. నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని అందుకోసం ప్రణాళికకు కూడా సిద్ధం చేసుకున్నాని తెలిపింది. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్‌ ఆడాలని నిర్ణయించుకున్నా.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/