లోయర్‌ ఆర్డర్‌ సిద్ధంగా ఉండాలి

టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే..

virat kohli
virat kohli

ఇంగ్లాండ్‌ పిచ్‌లపై టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సిద్దంగా ఉండాలని టీమిండియా సారథి విరాట్‌ సూచించాడు. శనివారం జరిగిన న్యూజిలాండ్‌తో ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే కష్టాలు ఎదుర్కొని 179 పరుగులు చేసింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో అందరూ నిరాశపడ్డారు.
టీమిండియా బ్యాటింగ్‌ గురించి విరాట్‌ మాట్లాడుతూ..ఇంగ్లాండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకపోతే, ఆ సమయంలో లోయర్‌ ఆర్డర్‌ ఆదుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందకు వారు ఎప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. వార్మప్‌ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డారు. ఇది జట్టుకు లాభించే అంశమే నని కోహ్లి అన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos