ఐపిఎల్‌లో ఓటములు సర్వసాధారణం: కోహ్లీ

Virat Kohli
Virat Kohli

జైపూర్‌: టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తున్న విరాట్‌ కోహ్లీకి…ఐపిఎల్‌ టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అతడి సారథ్యంలోని బెంగుళూరు జట్టు గత సీజన్లలో పలుమార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ కప్‌ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ 12వ సీజన్‌లో కోహ్లీ సేన పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన ఆర్‌సిబి…మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తద్వారా సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి నమోదు కావడంతో ఫ్యాన్స్‌ తట్టుకోలేకపోతున్నారు. ఆర్‌సిబి ఫ్యాన్స్‌ అని చెప్పలేకపోతున్నాం రా బాబూ అంటూ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ కోహ్లీ విశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరలేదని అతడి మాటల ద్వారా అర్థమవుతోంది. ఐపిఎల్‌-12లో భాగంగా సవా§్‌ు మాన్‌సింగ్‌ మైదానంలో ఆతిథ్య జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఖాతా తెరవని ఏకైక జట్టుగా ఆర్‌సిబి మిగిలింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆర్‌సిబి కెప్టెన్‌ కోహ్లీ మాట్లాడుతూ…ఈ రోజు మేము గట్ట పోటీ ఇచ్చామనే భావిస్తున్నా. మరో 15-20 పరుగులు చేసి ఉంటే అయితే ఐపిఎల్‌ లాంటి టోర్నమెంట్లలో ఇలాంటివి సర్వసాధారణం. ప్రారంభం బాగుండనత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మాలో ఇంకా పోరాట పటిమ మిగిలే ఉంది. జట్టు సభ్యులంతా కూర్చుని చర్చించుకుంటాం. విజయానికి కావాల్సిన సలహాలు వ్యూహాలు రచిస్తాం. మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని రానున్న మ్యాచ్‌లలో గెలుస్తామనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/