మొనాకో గ్రాండ్‌ ప్రి విజేత హామిల్టన్‌

Lewis Hamilton
Lewis Hamilton

మొనాకో గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచిన మెర్సిడస్‌ స్టార్‌ డ్రైవర్‌ ,ఐదుసార్లు ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌. చివరి వరకు ఉత్కంఠగా సాగిన రేసులో సెకను కన్నా తక్కువ సమయంలోనే ప్రత్యర్ధిని వెనక్కినెట్టి టైటిల్‌ సంపాదించాడు. రేసును గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. సెబాస్టియన్‌ వెటల్‌ రెండో స్థానంలో నిలిచాడు. వాల్తేరి బొటాస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో ఎఫ్‌-1 డ్రైవర్ల జాబితాలో హామిల్టన్‌ 137 పాయింట్లు సొంతం చేసుకుని మెరుగైన స్థానంలో నిలిచాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/