బిసిసిఐ ఛీఫ్‌ సెలక్టర్‌గా శివరామకృష్ణన్‌?

Laxman Sivaramakrishnan
Laxman Sivaramakrishnan

ముంబయి: ఎంఎస్‌కె ప్రసాద్‌ నేతృత్వంలో భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీకి గడువు ముగిసిందని, ఇక వారు తమ పదవీ కాలం దాటి కొనసాగరని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. కాగా తర్వాత ఆ బాధ్యతలను ఎవరు స్వీకరించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంలో వస్తున్న ప్రశ్నలన్నింటికి చెక్‌ పెడుతూ తాజా బిసిసిఐ కొత్త ఛీఫ్‌ సెలక్టర్‌గా ఎంఎస్‌కె ప్రసాద్‌ స్థానంలో ఒకప్పటి లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ నియమితులవుతారని బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతుంది. శివరామకృష్ణన్‌ భారత్‌ తరపున 9 టెస్టుల, 16 వ్డేలు ఆడారు. టెస్టు మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీయగా వన్డేల్లో 15 వికెట్లు తీసారు. శివరామకృష్ణన్‌ మొదటగా వెస్టిండీస్‌ తో 1983 ఏప్రిల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. చివరిగా 1986లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/