వన్డేలకు మలింగ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు

lasith malinga
lasith malinga

శ్రీలంక: లంక బౌలర లసిత్ మలింగ వన్డేల నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మలింగ మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించాడు. 2011లో టెస్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలలో 338 వికెట్లు తీసుకొని వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో అటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వన్డేలో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్ మలింగ్ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు మలింగ, వసీం అక్రమ్‌లు. ప్రపంచలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్ మలింగ ఒక్కడే. ట్వింటీ పార్మాట్ లో కొనసాగుతానని మలింగ పేర్కొన్నారు.


తాజా ఫోటో గ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/