భారత మార్కెట్‌పై కన్నేసిన లాలిగా…

న్యూఢిల్లీ: భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. స్పెయిన్ వేదికగా జరిగే ప్రఖ్యాత ఫుట్‌బాల్ టోర్నీ లాలిగా 2019 సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌లన్నీ ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు లా లీగా భారత్ ఎండి జోస్ ఆంటోనియో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీని భారత ఫుట్‌బాల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈసీజన్లో మొత్తం లాలిగా 380 మ్యాచ్‌లను ఫేస్బుక్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక కెమెరాలు, సాంకేతిక సాయంతో ఈసారి వినూత్నంగా టివిల్లోనూ ప్రసారమయ్యే లాలిగా మ్యాచ్‌లు వీక్షకులకు కొద్ది అనుభూతిని కలిగిస్తాయని ఆయన తెలిపారు. గత సీజన్లో లాలిగా టోర్నీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ వ్యూయర్షిప్ను సొంతం చేసుకున్నదని తెలిపారు.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/sports/