టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కోహ్లీ

Virat Kohli
Virat Kohli

హైదరాబాద్‌: గత కొన్నాళ్లుగా భారీ ఇన్నింగ్స్ లు బాకీ పడిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకుల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. యాషెస్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకాడు. కోహ్లీ తర్వాత మూడో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీతో పాటు టాప్ 10లో అజింక్యా రహానే కూడా ఉన్నాడు. రహానే ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా యువకిశోరం జస్ప్రీత్ బుమ్రా ఒక్కసారిగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. బౌలర్లలో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా ప్రధాన బౌలర్ కగిసో రబాడా రెండోస్థానంలో ఉన్నాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/