చరిత్ర చేరువలో కోహ్లీ!

kohil
kohil


విశాఖపట్నం: కోహ్లీకి పరిచయవాక్యాలు అవసరం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతనిది ఒక హిట్‌ చరిత్ర. ఎందుకంటే క్రికెట్‌ లెజెండ్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న మరో రికార్డును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేరువలో ఉన్నాడు. బుధవారం నుంచి విశాఖలో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ మరో 281 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 21 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఇదివరకు 473 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా విండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 485 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఇదిలా ఉండగా విరాట్‌కోహ్లీ ప్రస్తుతం వీరిద్దరికన్నా ఎంతో ముందంజలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 43 ఇన్నింగ్స్‌లో 20,719 పరుగులు చేశాడు. ఈ నేపధ్యంలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇంకా ఎంతో సమయం పట్టదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/