నేడు బంగ్లాతో రెండో వార్మప్‌ మ్యాచ్‌

kohli
kohli

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై కోహ్లి స్పందిస్తూ.. మిడిల్‌ ఆర్డర్‌పైనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని, మిడిల్‌ ఆర్డర్‌ని భర్తీ చేసేందుకు విజ§్‌ు శంకర్‌, కేదార్‌ జాదవ్‌లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసినా వారిద్దరూ గాయాల బారిన పడటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ప్రాక్టీస్‌లో విజ§్‌ు శంకర్‌ గాయపడ్డాడు. కేదార్‌జాధవ్‌ భుజానికి ఐపిఎల్‌లో గాయమైంది. విజ§్‌ు శంకర్‌ని తప్పించాల్సి వస్తే కోహ్లి కేఎల్‌ రాహుల్‌ని తీసుకునే అవకాశం ఉంది. మొదటగా దక్షిణాఫ్రికా లాంటి జట్టుతో తలపడేముందు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పూర్తి స్థాయిలో కోలుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/