ఆరో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టిన కోహ్లీ

Virat Kohli
Virat Kohli

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుతున్న రెండో టెస్టులో భారత్‌ ఆరవ వికెట్‌ కోల్పోయింది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 136 పరుగుల వద్ద ఇబాదత్‌ హొసన్‌ బౌలింగ్‌లో తైజుల్‌ ఇస్లాంకు క్యాచ్‌ ఇచ్చారు. కాగా భారత్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో ఇబాదత్‌ తీసినవి మూడు వికెట్లు కావడం గమనార్హం. రవి చంద్రన్‌ అశ్విన్‌, వృద్ధిమాన్‌ సాహా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 310 పరుగులు సాధించి బంగ్లాదేశ్‌ కంటే 204 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 106 పరుగులకే ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/