రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వండి

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి: వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ తేలిపోయాడని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు. అతని స్థానంలో రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మను ఓపెనర్ గా ప్రయత్నించాలనే విషయాన్ని తాను ముందే చెప్పానని గుర్తు చేశాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడని… అతనికి అవకాశం కల్పించాలని తాను ఇప్పటికీ చెబుతున్నానని అన్నాడు. ప్రపంచకప్ లో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన తర్వాత టెస్టుల్లో స్థానం దక్కుతుందని రోహిత్ భావించాడని చెప్పాడు. బుమ్రా గాయాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించాడు. మయాంక్ అగర్వాల్ బాగానే ఆడాడని కితాబిచ్చాడు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/