ఆ రికార్డులో టాప్‌లో కేఎల్‌ రాహుల్‌

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అతడి తర్వాతే

K. L. Rahul
K. L. Rahul

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలదే హవా కొనసాగుతోంది. ఈ త్రయం అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపుతున్నారు. విరాట్‌ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి అరుదైన ఘనతలు అందుకున్నాడు. వీరబాదుడుతో హిట్‌మ్యాన్‌గా అవతరించాడు రోహిత్‌ శర్మ. పదునైన యార్కర్లతో బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తిస్తూ బుమ్రా దూసుకుపోతున్నాడు. ఇప్పడు ఈ జాబితాలోకి లోకేష్ రాహుల్‌ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదిన మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రాహుల్..ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, కీపింగ్ ఏ పాత్ర ఇచ్చినా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. టీ20ల్లో చెలరేగుతున్న లోకేష్ రాహుల్.. ఇప్పుడు కోహ్లీ, రోహిత్‌కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2019, 2020 ఇన్నింగ్స్‌ తో కలిపి మొత్తం 7 అర్ధ శతకాలు సాధించాడు. దీంతో కోహ్లీ, రోహిత్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డు రాహుల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలతో పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో తనకిక తిరుగులేదని చాటుతున్నాడు. ప్రస్తుతం స్టేడియాల్లో భారత అభిమానులు ‘రాహుల్‌.. రాహుల్‌’ అని పొగిడేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/