వెస్టిండీస్‌ కెప్టెన్‌గా పొలార్డ్‌…?

Kieron Pollard
Kieron Pollard


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌, వన్డే, టీ20లకు కీరన్‌ పొలార్డ్‌ సారథిగా బాధ్యతలు అందుకోనున్నాడని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో, భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ విండీస్‌ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు జట్టు పగ్గాలను పొలార్డ్‌కు ఇవ్వనుందని సమాచారం. శనివాంర జరిగిన వెస్టిండీస్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథిగా పొలార్డ్‌ను సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించగా బోర్డు డైరెక్టర్లలో ఆరుగురు మద్దతు ఇవ్వగా ఆరుగురు ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం వన్డేలకు జేసన్‌ హోల్డర్‌, టెస్టులకు కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ కెప్టెన్లుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ పేలవ ప్రదర్శన చేసింది. మెగాటోర్నీలో కేవలం రెండే విజయాలు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్‌తో జరిగిన అన్ని ఫార్మట్‌ సిరీసుల్లోనూ ఘోరంగా విఫలమైంది. టీమిండియా చేతిలో వైట్‌వాష్‌ అయ్యింది. పొలార్డ్‌ తన ఆఖరి వన్డేను 2016లో ఆడాడు. ప్రపంచకప్‌కు అతడిని ఎంపిక చేయలేదు. కానీ భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌క ఎంపిక చేశారు. అతడు విండీస్‌ తరపున 101 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. వన్డేల్లో 25.71సగటుతో 2,289 పరుగులు చేసి 50 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 23 వికెట్లతో పాటు 903 పరుగులు చేశాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/