కరోనాపై పోరుకు విరాళాన్ని ప్రకటించిన కేదార్‌జాదవ్‌

kedar jadaav
kedar jadaav

ముంబయి: భారత్‌లో కరోనా మహామ్మారిపై పోరాడేందుకు క్రీడాకారులు తమవంతుగా ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌జాదవ్‌ కూడా చేరిపోయాడు. కోవిడ్‌-19 పై పోరు సాగిస్తున్న వైద్యసిబ్బందికి ఉపయోగకరమైన మాస్క్‌లు అందించడంతో పాటు, మహరాష్ట్ర సిఎం సహయనిధికి జాదవ్‌ తనవంతుగా విరాళాన్ని ప్రకటించాడు. కాని ఎంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడు. ప్రస్తుతం ఉన్న కఠిన పరిస్థితుల్లో సాయం చేయడం ప్రతి ఒక్కరి భాధ్యత. ప్రాణాలు లెక్కచేయకుండా సేవ చేస్తున్న వైద్యసిబ్బంది సాయం ముందు మనం చేసే సాయం ఎంత. వైద్యుల కోసం సహకరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. అని జాదవ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/