టీ20 ట్రోఫీలను ఆవిష్కరించనున్న కరీనా కపూర్‌…

kareena kapoor
kareena kapoor

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి, పటౌడీ వంశం కోడలు కరీనా కపూర్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల, మహిళల ఐసిసి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను మెల్‌బోర్న్‌లో ఆమె ఆవిష్కరించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వరకు జరగనున్న ఐసిసి టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ముందే మహిళల టీ20 టోర్నీ జరగనుంది. మహిళల టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు జరగనుంది. ఈసందర్భంగా కరీనా కపూర్‌ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరుపున ఆడుతున్న మహిళలందరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు రాణించడాన్ని చూడటం నిజంగా చాలా శక్తినిస్తుంది. వారు మనందరికీ స్ఫూర్తిదాయం అని అన్నారు.భారత క్రికెట్‌ జట్టు తరపున ఆడిన గొప్ప క్రికెటర్లలో దివంగా మా మామగారు ఒకరు. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉందని కరీనా కపూర్‌ ఖాన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/