గాయంతో మైదానంలో విలవిల్లాడిన విలియమ్సన్‌….

kane williamson
kane williamson, newzeland captain

వెల్లింగ్టన్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయంతో విలవిల్లాడాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. అయితే ఇప్పుడు అసాధారణ గాయమని సమయంలో విలియమ్సన్‌కు ఆగాయం తిరగబెట్టింది. ఆ నొప్పి భరించలేక మైదానంలో ఫిజియోలు పలుమార్లు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి స్కానింగ్‌ తీయంచగా మామూలు గాయమేనని తేలింది. నొప్పితోనే బ్యాటింగ్‌ చేసిన విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌ అర్థసెంచరీ సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్‌ రాస్‌టేలర్‌ డబుల్‌ సెంచరీ సాధించగా…హెన్రీ నికోలస్‌ శతకం బాదడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 432/6వద్ద డిక్లేర్డ్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగుల చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 141 పరుగులు వెనుకబడి ఉంది.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/