స్మిత్ చెత్త సెంచరీలు చేశాడు: జాంటీ రోడ్స్

ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అన్నాడు. కోహ్లి ఆటను తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని..అతడే బెస్ట్ క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. బాల్ టాంపరింగ్ వివాదం-నిషేధం అనంతరం.. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్లోడబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లి అధిగమించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లోనూ స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.