తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న జోఫ్రా ఆర్చర్‌

jofra archer
jofra archer

లండన్‌: తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఇంగ్లాండ్‌ యువ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో అద్భుత బౌలింగ్‌ చేశాడు. ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 27 పరుగులకే మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా..ఇంగ్లాండ్‌ ముందుగా ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. కాని ఐపిఎల్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకుని ఆఖరి నిమిషంలో ఎంపికయ్యాడు. దీంతో సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ అతడు తొలి మ్యాచ్‌లోనే విజృంభించాడు.
ఆర్చర్‌ మీడియాతో మాట్లాడుతూ..తొలిసారి ప్రపంచకప్‌లో ఆడటం చాలా సంతోషంగా ఉంది. తాను అనుకున్న దానికన్నా నాలుగేళ్ల ముందే ఇక్కడ ఆడుతున్నా నా మీద ఎలాంటి ఒత్తిడి లేదని, ఆ ప్రపంచకప్‌ను ఆస్వాదించాలనుకుంటున్నానని ఐతే ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ప్రపంచకప్‌లో ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదం చేస్తుందని వివరించాడు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos