జార్ఖండ్‌ ఎన్నికలలో ఓటు వేసిన ధోనీ

MS Dhoni
MS Dhoni

రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మూడో విడత పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో జార్ఖండ్‌ డైనమైట్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన తన భార్యతో కలిసి వచ్చి ఓటును వేశారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మిస్టర్‌ కూల్‌ ధోనీ అందరికి నవ్వుతూ అభివాదం చేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/