అది అసలు వికెట్‌గా పరిగణించకూడదు: బట్లర్‌…

butler run out
butler run out

జైపూర్‌: ఈ ఐపిఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ చేయడం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ ఆటగాళ్లతో సమా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశాఉ. మన్కడింగ్‌ విధానం క్రీడాస్పూర్తికి విరుద్ధమని కొందరు పేర్కొనగా క్రికెట్‌ లా మేకర్‌ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసిసి) దాన్ని కొట్టిపారేసింది. ఈ విధానం ఆటలో భాగమేనని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయం సద్దుమణిగింది. కాగా ఈవివాదంపై బట్లర్‌ పెదవి విప్పాడు బట్లర్‌. ఆ మ్యాచ్‌ అనంతరం తాను అశ్విన్‌ దగ్గరకు వెళ్లి…నువ్వు ఇలాంటి క్రికెటే ఆడాలనుకుంటున్నావా…ఇదేనా నీ క్రికెట్‌ గేమ్‌ అని సూటిగా ప్రశ్నించానని బట్లర్‌ మీడియాతో చెప్పాడు. అశ్విన్‌ కావాలనే బౌలింగ్‌ చేస్తున్నట్లు నటించి తాను క్రీజు వదిలాక బంతిని బెయిల్స్‌కు తాకించి తన వికెట్‌ తీశాడని అన్నాడు. అది అసలు ఔట్‌గా ప్రకటించకూడదు. కానీ జరిగిపోయిందని బట్టర్‌ మీడియాకు వివరించారు. మరొకవైపు రాబోవు వన్డే ప్రపంచకప్‌ గురించి మాట్లాడుతూ ప్రపంచకప్‌ అనేది ఓపెన్‌ రేస్‌ అని…ఈసారి ఇంగ్లాండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. అలాగే భారత్‌, ఆసీస్‌జట్లు కూడా పోటీలో ఉన్నాయని తెలిపాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/