ఐపిఎల్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లో జరిగే అవకాశం…

hyderabad uppal stadium
hyderabad uppal stadium

న్యూఢిల్లీ: ఐపిఎల్‌-2019 తుది పోరు హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్‌ వేదికగా ఉప్పల్‌ స్టేడియనాఇ్న సిఓఏ దాదాపుగా ఖరారు చేసింది. చెన్నైలో ‘స్టాండ్స్‌ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఇదే ఖాయమవుతుంది. వాస్తవానికి గత ఏడాది సూపర్‌ కింగ్స్‌ విజేతగా నిలవడంతో చెన్నైలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘స్టాండ్స్‌ వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌, చెన్నై మున్సిపల్‌ కార్పోరేషన్‌ మధ్య గొడవ కారణంగా ఏ మ్యాచ్‌ జరిగినా కూడా మూడు స్టాండ్‌లు అప్పటినుంచి ఖాళీగానే ఉంటున్నాయి. అయితే దీనిని తేల్చుకునేందుకు అసోసియేషన్‌కు సిఓఏ వారం రోజులు గడువిచ్చింది. ‘మూడు స్టాండులు అంటే 12వేల మంది ప్రేక్షకులు. ఇంతమంది కనిపించకపోతే మైదానం బోసిపోతుంది. ప్లేఆఫ్‌కు సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోరాదని మేమూ కోరుకుంటున్నాం. అయితే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకురాకపోతే 2018 రన్నరప్‌ హైదరాబాద్‌లోనే ఫైనల్‌ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగుళూరులో…జరుగుతాయని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/