యువ క్రికెటర్ కోసం ముంబై- చెన్నై పోటీ

Tom Banton
Tom Banton

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఇంకా పాపులర్ కాలేదు. కానీ, త్వరలో తప్పక అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ వేలంలో ఇతగాడి పేరు కూడా ఉంది. అతడి పేరు టామ్ బాంటన్ ఇప్పటికే ఈ యువ క్రికెటర్ గురించి ఐపీఎల్‌లో టాప్ ప్రాంఛైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరా తీయడం విశేషం. ముంబై, సిఎస్‌కె ఫ్రాంచైజీలను ఆకర్షించాడంటే? అతడిలో ఉన్న ప్రత్యేకతలేంటి? టామ్ బాంటన్ బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుంది. 21 ఏళ్ల టామ్ బాంటన్ ఇన్నవేటివ్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త కొత్త షాట్లను కనిపెట్టడంలో దిట్ట. అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో కలందర్స్ జట్టు తరుపున ఆడిన టామ్ బాంటన్ 28 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. అయితే, ఇలాంటి సూపర్ ప్రదర్శన టామ్ బాంటన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బాంటన్ 42.23 యావరేజితో 549 పరుగులు చేశారు. స్ట్రయిక్ రేట్ 161.43గా ఉన్న ఈ ఆటగాడు వ్యక్తిగతంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాలని ఉందని చెప్పాడు.
ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో బాంటన్ మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఆడాలని చిన్న వయస్సు నుండే నా కల. ఐపీఎల్ మ్యాచ్‌లకు పెద్దఎత్తున అభిమానులు హాజరవుతారు అని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national