ఐపిఎల్‌ 2020 వేలంలో క్రికెటర్ల ధరలివే!

IPL 2020
IPL 2020

కోల్‌కతా: ఐపిఎల్‌ 2020 సీజన్‌ ఆటగాళ్ల వేలం డిసెంబర్‌ 19న కోల్‌కతా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆటగాళ్ల వేలంలోకి రూ. 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు క్రికెటర్లు వస్తుండగా, రూ. 1.5 కోట్ల కనీస ధరతో మరో 9 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రాబిన్‌ ఉతప్పను వేలంలోకి విడిచిపెట్టడంతో అతడు రూ. 1.5 కోట్ల వేలంలోకి వస్తున్నాడు. అయితే ఈ రెండు ధరల జాబితాలో కేవలం ఒక్క భారత ప్లేయర్‌గా రాబిన్‌ ఉతప్ప మాత్రమే ఉన్నారు. రూ. 2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ ముందు వరుసలో ఉన్నారు. ఆ దేశానికి చెందిన బ్యాట్స్‌మెన్‌లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, క్రిస్‌లిన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఉన్నారు. వీరితోపాటు శ్రీలంక నుంచి మాథ్యూస్‌, దక్షిణాఫ్రికా బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ రూ. 2 కోట్ల వేలంలోకి వస్తున్నారు. అలాగే రూ. 1.5 కోట్ల ధర వేలంలోకి రాబిన్‌ ఉతప్ప ముందంజలో ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన షాన్‌ మార్ష్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఇగ్లాండ్‌కు చెందిన డేవిడ్‌ విల్లీ, క్రిస్‌వోక్స్‌, జేసన్‌ రా§్‌ు, ఇయాన్‌ మోర్గాన్‌, అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్‌ మోరిస్‌, కైల్‌ అబాట్‌లు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/