ఐపిఎల్‌ వేలంలో మా దృష్టి వారిపైనే

Ricky Ponting
Ricky Ponting

ఢిల్లీ: ఐపిఎల్‌ వేలంలో తమ దృష్టంతా విదేశీ పేసర్లపైనే ఉంటుంని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. జట్టు లక్ష్యాలను చర్చించడానికి అతడు శనివారం టీం మేనేజ్‌మెంట్‌ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. చాలా కాలంగా తాము వేలం గురించి చర్చించామని, ఎంతో సమయం తర్వాత అందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ముందుగా మనం చాలా ప్రణాళికలు చేస్తాం కానీ వేలం జరిగేటప్పుడు మాత్రం మనం అంచనాలు వేయలేం. జరగబోయే వేలంలో తాము ఎక్కవగా ఫాస్ట్‌ బౌలర్లపై దృష్టి సారించాం. ముఖ్యంగా విదేశీ ఫాస్ట్‌ బౌలర్లపై. నా అంచనా ప్రకారం ఆల్‌రౌండర్లపై ఎప్పుడూ ఆసక్తి ఉటుంది. వేలానికి వెళ్లినప్పుడు ఏఆటగాడిని తీసుకోవాలనే అంశంపై నిర్దిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. మాకు ఆ అవసరం లేదు కానీ జట్టుకు సంబంధించి ఎక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం ఆ దిశగా సరైన ప్రణాళిక వేసుకోవాలని పాంటింగ్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/