పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి వైదొలగనున్న ఇంజమామ్‌

inzamam ul haq
inzamam ul haq, Pakistan chief selector

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంజమామ్‌ ప్రస్తుత పదవీకాలం జూలై 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెలక్టర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోవడం వల్ల ఇంజమామ్‌పై వేటు పడింది.
తన పదవీవిరమణ చేయాల్సిన సమయం జూలై 30తో ముగుస్తుందని, క్రికెట్‌ తన ప్యాషన్‌అని, కానీ తాను జట్టు ఎంపిక ప్రక్రియలో భాగం కావడం ఇష్టం లేదని, దురదృష్టవశాత్తు ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఓడిపోయామని తరువాత మ్యాచ్‌లలో రన్‌ రేటును సాధించలేకపోయామని ఇంజమామ్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/