ప్రారంభమైన టీమిండియా కోచ్‌ ఇంటర్వ్యూలు

రవిశాస్త్రి వైపే మొగ్గు?

Ravi Shastri
Ravi Shastri

ముంబయి: టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు ప్రారంభమైనవి. మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ఆధ్వర్యంలోని అన్షుమాన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామిల క్రికెట్‌ సలహా మండలి ఈరోజు ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. దాదాపు 2 వేల మందికి పైగా ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో ఆరుగురిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వారిలో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో సహా, మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, మైక్‌ హెస్సన్‌, టామ్‌మూడీ, ఫిల్‌ సిమ్మన్స్‌ ఉన్నారు. ఇప్పటికే రాబిన్‌సింగ్‌ ఇంటర్వ్యూ పూర్తైందని తెలుస్తోంది. ఈ ఆరుగురినీ ఈరోజు ఇంటర్వ్యూ చేసి రాత్రికి కొత్త కోచ్‌ని ప్రకటించే అవకాశం ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/