బాక్సింగ్‌ క్రీడాకారిణీ సుమన్‌కుమారిపై దాడి

suman kumari
suman kumari

కోల్‌కత్తా: అంతర్జాతీయ శ్రేణి బాక్సింగ్‌ క్రీడాకారిణీ సుమన్‌కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె శుక్రవారం ద్విచక్రవాహనం మీద ఆఫీసుకు వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ..ఆమె మీద దాడి చేశాడు. తనకు ఎదురైన పరాభవాన్ని సుమన్‌ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నేను స్కూటీ మీద ఆఫీసుకు వెళ్తున్నాను. బస్టాండ్ వద్దకు వెళ్లగానే ఓ వ్యక్తి నా ఎదురుగా వచ్చి నన్ను అడ్డుకున్నాడు. అసభ్యకరంగా మాట్లాడాడు. వెంటనే బస్‌ ఎక్కి వెళ్లిపోయాడు. నేను బస్‌ను ఫాలో అయి తర్వాతి స్టాప్‌లో అతడిని పట్టుకుని నిలదీశాను. నన్నెందుకు తిట్టాడో అడిగాను. అతడు మళ్లీ నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా నా గొంతు పట్టుకున్నాడు. నేను వెంటనే పక్కనే ఉన్న పోలీసులను పిలిచాను. వాళ్లొచ్చేలోపు అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారుగ అని ఫేస్‌బుక్ పోస్టులో ఆమె పేర్కొన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/