బంగ్లాపై భారత్ ఘనవిజయం

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి టి20లో విజయం సాధించిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే కాగా ఈరోజు రెండో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సిరీస్ లో నిలవాలంటే భారత్ 154 లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా భారత్ తొలి ఓవర్ నుండే ధాటిగా ఆడి మరో 4.2 ఓవర్లు మిగిలిఉండగానే మ్యాచ్ ను ముగించింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 85, శిఖర్ ధావన్ 31, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/