న్యూ జెర్సీల్లో మెరిసిన క్రికెటర్లు

indian-cricketers
indian-cricketers

అంటిగ్వా : భారత క్రికెటర్లు కొత్త జెర్సీల్లో మెరిశారు. టెస్టు క్రికెట్‌లో ఐసిసి కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల్లో భాగంగా భారత ఆటగాళ్లకు కూడా కొత్త జెర్సీలను కేటాయించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం భారత్‌వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక, ఐసిసి కొత్త నిబంధనల ప్రకారం జెర్సీలపై నంబర్లతో పాటు ఆటగాళ్ల పేర్లను ముద్రిస్తున్నారు. యాషెస్ సిరీస్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా ఈ విధానానికి తెరలేపాయి. తాజాగా భారత్, విండీస్ జట్లు కూడా కొత్త జెర్సీలతో మెరువనున్నాయి. మొదటి టెస్టును పురస్కరించుకుని భారత క్రికెట్ బోర్డు క్రికెటర్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. తెల్లని జెర్సీల వెనక క్రికెటర్ల పేర్లు ముద్రించారు. వీటిని ధరించిన టీమిండియా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఫొటో షూట్‌లో సరదాగా పాల్గొన్నారు. క్రికెటర్లు కొత్త జెర్సీల్లో దిగిన చిత్రాలను వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/