ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన టీమిండియా…

cricket team india
cricket team india


ముంబయి: ప్రపంచ టీ20కి ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రాబోవు సిరీసుల్లో యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్ధేశ్యంతో కీలక ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌…తాజాగా కుల్దీప్‌, చాహల్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. స్మిత్‌ బౌలింగ్‌ విభాగంలో కాస్త వైవిద్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నాటికి యువ క్రికెటర్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్‌, చాహల్‌లు పొట్టి ఫార్మట్‌లో అసాధారణమైన బౌలర్లు.

అందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే మాకున్న మిగతా బౌలింగ్‌ ఆప్షన్‌కు పరీక్షించాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/