శిఖర్‌ ధావన్‌ స్థానంలో సంజు శాంసన్‌ ఎంపిక

Sanju Samson
Sanju Samson

ముంబాయి: టీమిండియాలో ఆడటానికి ఒకే ఒక్క అవకాశం ఎదురుచూస్తున్న యువ ఆటగాడు సంజు శాంసన్‌కు ఉరట లభించింది. వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20 సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. మోకాలి గాయం కారణంగా వెస్టిండిస్‌తో డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. గాయపడ్డ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో సంజుకు చోటిచ్చారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నిలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. క్రీజును చేరుకునే సమయంలో డైవ్‌ చేయడంతో శిఖర్‌ ధావన్‌ కాలుకి కట్టె ముక్క కోసుకోవడంతో మోకాలికి 20 కుట్లు పడ్డాయి. దీంతో ఆయనకు రెస్ట్‌ ఇచ్చారు. గబ్బర్‌ మోకాలి గాయంతో ఎట్టకేలకు సంజు శాంసన్‌కు చోటు దక్కింది. 2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజు ఏడో స్థానంలో దిగి 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడు టీమిండియా పునరాగమనం చేయలేదు. కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సంజు ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. వికెట్‌ కీపింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 డిసెంబర్‌ 6న హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/