కోహ్లీ వికెట్‌ తీసి ముక్కున వేలేసుకున్నవిలియమ్స్

kesrick williams & virat kohli

virat kohli & kesrick williams

తిరువనంతపురం: వెస్టిండిస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ తన సంబరాలను రొటీన్‌‌కు భిన్నంగా చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయగానే.. జేబులో నుంచి నోట్‌బుక్‌ తీసి టిక్కు పెట్టి ఓ పనైపోయినట్లు సంబరాలు చేసుకోవడం అతడికి అలవాటు. కానీ, రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినా తనదైన ‘నోట్‌బుక్ టిక్ మార్క్’ పద్ధతిలో కాకుండా ‘నిశబ్దం’గా సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు కారణం హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించిన కోహ్లీ అతడిని అనుకరిస్తూ బదులిచ్చాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో రెండో టీ20లో కోహ్లీ వికెట్‌ను విలియమ్సే తీసినప్పటికీ తనదైన శైలిలో సంబరాలు చేసుకోకుండా నోటిపై వేలు వేసుకున్నాడు. కాగా మూడో టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/