అతని హృదయాన్ని పరీక్షించాలనుకుంటున్నారా?

sanju samson & shashi-tharoor
sanju samson & shashi-tharoor

ముంబయి: కేరళ యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ అందరికి సుపరిచితమే. శాంసన్‌ టీమిండియాతో ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సంజు శాంసన్‌ ఆడితే సంతోషించేవాడినని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అన్నారు. సొంత మైదానమైన తిరువనంతపురంలో టీమిండియా అతడికి ఆడే అవకాశం కల్పించనందుకు శశి థరూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత అభిమానుల ముందు సంజు శాంసన్‌ ఆడేందుకు టీమిండియా ఒక ఆటగాడికి విశ్రాంతి ఇస్తుందని మాలో చాలామంది ఆశించాం. తిరువనంతపురంలో అద్భుతాలు చేయాలని కోరుకున్నాం. కానీ నిరాశే ఎదురైంది. శాంసన్‌కు ఉన్న ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం అంటూ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో సంజుకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు కూడా శశిథరూర్‌ స్పందించారు. అవకాశం ఇవ్వకుండా శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది అన్నారు. సంజు బ్యాటింగ్‌ పరీక్షించాలనుకుంటున్నారా లేక అతడి హృదయాన్నా? అంటూ శశి థరూర్‌ ట్వీట్‌లో రాశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/