హైదరాబాద్ చేరుకున్న భారత్- వెస్టిండీస్ జట్లు

West indies & Team india
West indies & Team india

హైదరాబాద్‌: భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ మైదానంలో తొలి మ్యాచ్‌ జగరనుంది. ఈ నేపథ్యంలో భారత్‌-వెస్టిండీస్‌ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. రావడమే ఆలస్యం విండీస్‌ జట్లు తన ప్రాక్టీసును ఉప్పల్‌ స్టేడియంలో మొదలు పెట్టింది. దాదాపు మూడు గంటలపాటు కరేబియన్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, రన్నింగ్‌ ప్రాక్టీసు చేశారు. ఇక పోతే టీమిండియా మధ్యాహ్నం తన ప్రాక్టీసును కొనసాగించనుందని హెచ్‌సిఏ అధికారులు పేర్కొన్నారు. బుధవారం, గురువారం కూడా ఇరు జట్లు తమ ప్రాక్టీసును ఉప్పల్‌ మైదానంలో కొనసాగిస్తాయని తెలిపారు. కాగా శుక్రవారం జరిగే మ్యాచ్‌ ఉప్పల్‌ మైదానంలో రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్లు, ఈ మ్యాచ్‌ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు కీలక సమాచారం. అయితే ముంబయిలో ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్‌ భద్రతా కారణాల వల్ల హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని బిసిసిఐ తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/