భారత్ కు 274 టార్గెట్ ఇచ్చిన కివీస్

India vs New zealand 2nd ODI
India vs New zealand 2nd ODI

ఆక్లాండ్: భారత్- న్యూ జిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే లో కివీస్ టీమిండియా ముందు 274 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఓపెనర్లు 93 పరుగులు భాగస్వామ్యం ఇచ్చిన మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో తక్కువ స్కోర్ కే న్యూజిలాండ్ చాపచుట్టేసింది. ఎనిమిదో వికెట్ పై 76 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. గుప్తిల్, టైలర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. టైలర్ 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్(79), టైలర్(73) నికోలస్(41), జమ్సీన్(25)నాటౌట్, బ్లండెల్(22) పరుగులు చేసి ఔటయ్యారు. టైలర్ 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా టాకూర్ రెండు వికెట్లు జడేజా ఒక వికెట్ తీశాడు. నీశమ్, గుప్తిల్ రనౌట్ రూపంలో ఔటయ్యారు.

తాజా ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/