భారత్‌-బంగ్లా మ్యాచ్‌కి టికెట్‌ ఎంతో తెలుసా?

Eden garden
Eden garden


కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరగబోతున్న భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కి టికెట్‌ ధరను అమాంతం తగ్గించింది. డే/నైట్‌ మ్యాచ్‌ కావడంతో క్రీడాభిమానులు అధిక సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో టికెట్‌ ధరను రూ.50గా ఉంటే మైదానం నిండిపోయే అవకాశం ఉంటుందని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 68వేల సీట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఈ మైదానంలో టికెట్‌ ధరలను రూ. 50, రూ.100, రూ.150గా నిర్ణయిస్తామన్నారు. కాగా చలికాలం కావడంతో మంచు ప్రభావం ఆటపై పడకూడదని గంట ముందుగానే మ్యాచ్‌ని ప్రారంభించాలని బిసిసిఐని అనుమతి కోరినట్లుగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అభిషేక్‌ దాల్మియా తెలిపారు. బిసిసిఐ అనుమతి ఇస్తే సాధారణంగా 2.30గంటలకు జరిగే మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు మొదలై రాత్రి 8.30గంటలకు ముగుస్తుందన్నారు. టీ బ్రేక్‌, లంచ్‌ బ్రేక్‌ యధావిథిగా అంతే సమయం కేటాయిస్తామని పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/