టాస్‌ గెలిచి బౌలింగ్‌ తీసుకున్న బంగ్లా

మ్యాచ్‌కు దూరంగా స్మృతి మంధాన

INDIA WOMEN VS BANGLADESH WOMEN MATCH
INDIA WOMEN VS BANGLADESH WOMEN MATCH

పెర్త్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌.. వాకా మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి బంగ్లా కెప్టెన్ సల్మా ఖాతున్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. జ్వరంతో బాధపడుతున్న ఆమె స్థానంలో రీచా ఘోశ్‌ జట్టులోకి వచ్చింది.తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే భారత్‌కు షాక్‌ ఇచ్చి మెగా టోర్నీలో శుభారంభం చేయాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. గ్రూప్‌ఎలో భారత్‌, బంగ్లాతో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. వీటిలో టాప్‌2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం కివీస్, భారత్‌, ఆసీస్‌ తలో రెండు పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

జట్లు:

భారత్‌: షెఫాలీ వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్)‌, దీప్తి శర్మ, రీచా ఘోశ్‌, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్, రాజేశ్వర్‌ గైక్వాడ్‌.
బంగ్లాదేశ్‌: ముర్షిదా ఖాతున్, షమిమా సుల్తానా, సంజిదా ఇస్లామ్‌, నిగర్‌ సుల్తానా, ఫర్గానా హోక్‌, రుమాన అహ్మద్‌, సల్మా ఖతున్‌ (కెప్టెన్), ఫాహిమా ఖతున్‌, జహానారా ఆలం, పన్నా ఘోశ్‌‌, నహిదా అక్తర్‌.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: