సచిన్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

వాఖండేలో సచిన్‌ రికార్డును సమం చేస్తాడా?

sachin tendulkar & virat kohli
sachin tendulkar & virat kohli

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన వన్డే ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేయనున్నాడు. భారత్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(20 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఆ రికార్డుకి ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. స్వదేశంలో ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు. మూడు వన్డేల సిరిస్ కోసం ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. భారత పర్యటనలో భాగంగా మంగళవారం వాంఖడె వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన సచిన్ రికార్డుని సమం చేస్తాడు. ఇటీవలే పూణె వేదికగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం శ్రీలంకతో మూడో టీ20లో తొలి పరుగు తీసి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/