సౌతాఫ్రికా- స్కోరు: 72/4

India versus South Africa test Match

పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ నాలుగో రోజు రెండో ఇన్నింగ్‌లో సౌతాఫ్రికా వెంట వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. 54 బంతులు ఆడిన డు ప్లెస్సిస్‌ 5 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ప్లెస్సి సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అలాగే 72 బంతులు ఆడిన ఎల్గర్ 48 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లో ఎల్గర్ ఉమేష్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 25.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. డీకాక్‌ (0), బవుమా (1) క్రీజులో ఉన్నారు.

తాజా స్వస్థ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/